News February 21, 2025
నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు

నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు చేశారు. ఈ రైలు నంద్యాల నుంచి ఉదయం 6:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు రేణిగుంటకు చేరుకునేది. నేటి నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంటలో మధ్యాహ్నం 1:50కి బయలుదేరి, నంద్యాలకు రాత్రి 8:40 గంటలకు చేరుకుంటుంది. నిర్వహణపరమైన కారణాల వల్ల మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News September 19, 2025
ANU: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. ఈనెల 21వ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు.
News September 19, 2025
కాకినాడ: టీడీపీలో చేరనున్న కర్రి పద్మశ్రీ

కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇవాళ సాయంత్రం టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ హయాంలో గవర్నర్ కోటాలో ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ముగిసిన తర్వాత సీఎం సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ పద్మశ్రీ భర్త నారాయణరావు Way2Newsకు ఫోన్‌లో తెలియజేశారు. కాగా ఆమె రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.
News September 19, 2025
నెల్లూరు జిల్లాలో వేగంగా MSME పార్కులు

సీఎం చంద్రబాబు విజన్-2047లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ లేదా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆత్మకూరు నారంపేటలో పారిశ్రామికవాడ, నెల్లూరు అర్బన్ భగత్‌సింగ్ కాలనీలో రూ.12 కోట్లతో జీ+2 ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుండగా, ఆమంచర్లలో 59 ఎకరాల్లో MSME పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపాదన దశలో ఉన్నాయి.