News February 21, 2025
బాపట్ల: డిప్యూటీ సీఎం ఫొటోలు మార్ఫింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై బాపట్ల జనసేన నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం జనసేన నాయకురాలు జిడుగు మాధురి పట్టణ సీఐ రాంబాబును కలిసి మార్ఫింగ్ చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సీఐ రాంబాబు తెలిపారు.
Similar News
News December 5, 2025
ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో <<18478689>>సాయి ఈశ్వర్<<>> బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని హరీశ్‌రావు చెప్పారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ‘ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
News December 5, 2025
NLG: గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి

నల్గొండ జిల్లా తిప్పర్తి, జొన్నలగడ్డ గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల కోసం నిధులను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
News December 5, 2025
వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలి: కలెక్టర్

ఓటరు జాబితాలో ఉన్న వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లపై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లను తప్పకుండా పంపించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


