News February 21, 2025

ఎస్వీ మెడికల్ కళాశాలలో 9 మంది వైద్యులు తొలగింపు

image

ఎలాంటి అనుమతులు, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు విధులకు హాజరుకాని వారికి నోటీసులు ఇచ్చిన స్పందించని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో 9 మంది వైద్యులను లోకాయుక్త ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఎం.వెంకటరావు, వీ.సరస్వతి, బీ.కిరణ్ కుమార్, కే.మధురిమ నాయుడు, పీ.నలిని, బి.చంద్రశేఖర్, కే.లావణ్య, ఏ.కార్తీక్, ఈ. శ్రీకాంత్‌ను తొలగించారు.

Similar News

News September 15, 2025

మేడ్చల్ జిల్లాలోని B.Ed కాలేజీలకు క్యాండిడేట్స్ లాగిన్

image

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న B.Ed కాలేజీల్లో సీటు పొందిన క్యాండిడేట్స్ వివరాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేక లాగిన్ అందుబాటులో ఉంచినట్లుగా ఓయూ అధికారులు తెలిపారు. ఒక్కో కాలేజీలో 20- 30 సీట్ల వరకు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాండిడేట్స్ వివరాలతో కూడిన ప్రత్యేక షీట్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 15, 2025

ఉద్దేశపూర్వకంగానే బకాయిల ఎగవేత: కవిత

image

TG: కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.

News September 15, 2025

KNR: రాజీవ్ యువ వికాసం.. దసరాకైనా అందేనా..?

image

రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి పొందవచ్చని భావించిన ఉమ్మడి KNR జిల్లా నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్నాయి. జూన్ 2న రూ.50వేల నుంచి రూ.లక్షలోపు దరఖాస్తు చేసుకున్న అర్హులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించి చివరి నిమిషంలో నిలిపేసింది. AUG 15న వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే ఎదురైంది. ఈ దసరాకైనా వస్తాయని ఆశతో ఎదురుచూస్తోంది. ఉమ్మడి KNR వ్యాప్తంగా 1,71,116 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.