News March 21, 2024

అమ్రాబాద్: యువకుడి సూసైడ్

image

అమ్రాబాద్ మండలానికి చెందిన ఎల్కచేను నీలమ్మ, నాగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారైన స్వామి బుధవారం ఉదయం వ్యవసాయ పొలంలో టేకు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔పాలమూరు ప్రాజెక్ట్‌కు జైపాల్ రెడ్డి పేరు ఎలా పెడతారు: ఎంపీ డీకే అరుణ✔వడ్డేమాన్‌: సంపులో పడి యువరైతు మృతి✔NGKL మాజీ ఎంపీకి జూపల్లి పరామర్శ✔ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి✔MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్✔MBNR:7 నుంచి సదరం క్యాంపులు ✔రేపటి నుంచి సీసీ టీవీ కెమెరా సర్వీసింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ప్రారంభం✔పలుచోట్ల పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు 

News January 6, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వార్తలు ఇవే.. డోంట్ మిస్ 

image

❤️హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్​లోకి నో ఎంట్రీ: వనపర్తి కలెక్టర్ బాదావత్ సంతోష్.❤️జీవితంలో సైన్స్ చాలా అవసరం:నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్.❤️కాలేజీ బాత్​రూమ్​లో కెమెరా కలకలం: పోలీసుల అదుపులో ఓ యువకుడు.❤️బొట్టు పెట్టి చెప్తున్నాం.. పేరెంట్స్‌‌‌‌ మీటింగ్‌‌‌‌కు రండి సింగోటంలో గ్రామస్తులను ఆహ్వానించిన టీచర్లు.❤️ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: ఎస్పీ గిరిధర్

News January 6, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు గణేశ్(30), రామకోటి(25)లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.