News February 21, 2025

VJA: నేడు కోర్టు తీర్పు

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైసీపీ నేత వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్‍పై గురువారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. కాగా ఈ రెండింటిపై శుక్రవారం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. అటు నేడు వంశీ సహా ఈ కేసులోని మరో ఇద్దరు నిందితుల కస్టడీ పిటిషన్లపై కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 30, 2025

గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్లకు భారీ డిమాండ్

image

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్లు ధరలు సాధారణ రకం రూ. 200 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కుటుంబాలు, యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది.

News December 30, 2025

సిరిసిల్ల: ‘టీ-పోల్’ నుంచే ఓటర్ల జాబితాలు డౌన్‌లోడ్

image

రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘టీ-పోల్’ నుంచే ఓటర్ల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన, డౌన్‌లోడ్ తదితర సాంకేతిక అంశాలపై ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశం చేశారు.

News December 30, 2025

డైలీ 4వేల అడుగులు వేస్తే మరణ ముప్పు తగ్గినట్లే: అధ్యయనం

image

యువకుల్లా వృద్ధులూ రోజూ 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 72 ఏళ్ల వృద్ధ మహిళలపై 11 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో.. వారానికి కేవలం 1-2 రోజులు 4,000 అడుగులు నడిచినా గుండె జబ్బులు, మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది. మెట్లు ఎక్కడం, భోజనం తర్వాత నడక వంటి చిన్న చిన్న మార్పులతో ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT