News March 21, 2024
IPL-2024లో కొత్త రూల్
IPL-2024లో ఈసారి ఓవర్‌కు రెండు షార్ట్ బాల్స్(బౌన్సర్)ను అనుమతించనున్నారు. గత సీజన్ వరకు ఓవర్‌కు ఒక బౌన్సర్ మాత్రమే వేయాలనే రూల్ ఉండేది. అలాగే స్టంపింగ్ కోసం థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేసినప్పుడు ముందుగా క్యాచ్‌ను చెక్ చేసే రూల్‌ను కొనసాగించనున్నారు. ఔట్, నాటౌట్‌తో పాటు వైడ్, నో బాల్ కోసం ఒక్కో టీమ్‌కు రెండు రివ్యూలను కంటిన్యూ చేయనున్నారు. ఇటీవల ICC తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్‌ను అమలు చేయడం లేదు.
Similar News
News November 25, 2024
లౌకిక, సామాజిక పదాలను తొలగించాలన్న PILs తిరస్కరించిన సుప్రీంకోర్టు
రాజ్యాంగ పీఠికలో లౌకిక, సామాజిక పదాలను తొలగించాలన్న 3 పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంతో పాటు పీఠికనూ సవరించే అధికారం పార్లమెంటుకే ఉందని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ PV సంజయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు 42వ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ 2 పదాలను పీఠికలో చేర్చారు. వీటిని తొలగించాలని మాజీ MP సుబ్రహ్మణ్య స్వామి సహా కొందరు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు.
News November 25, 2024
కేర్‌టేకర్ చనిపోయిన రోజే జిరాఫీ మృతి
కొందరికి జంతువులతో ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. జంతువులూ అలాంటివారిని ఎంతో ప్రేమిస్తుంటాయి. స్కోప్జే జూలో పనిచేసే కేర్‌టేకర్ ట్రాజ్‌కోవస్కీ కూడా అలాంటి కోవకు చెందినవారే. పదేళ్లపాటు ఫ్లాపీ అనే జిరాఫీని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దానికి ఆహారంతో పాటు అన్ని బాగోగులు చూసుకునేవారు. అయితే, గత ఏడాది నవంబర్ 26న అనుకోకుండా ట్రాజ్‌కోవస్కీ చనిపోగా గంటల వ్యవధిలోనే జిరాఫీ కూడా చనిపోయింది.
News November 25, 2024
MHలో బిహార్ ఫార్ములా అమలు చేయండి: శివసేన
మహారాష్ట్రలో బిహార్ ఫార్ములా అమలు చేసి ఏక్‌నాథ్ శిండేను CMగా కొనసాగించాలని శివసేన కోరుతోంది. బిహార్‌లో RJDతో JDU విడిపోయినప్పుడు నితీశ్ కుమార్‌ను CMగా BJP కొనసాగించింది. 2020 బిహార్ ఎన్నికల్లో BJP 74 సీట్లు సాధించింది. JDUకి 43 సీట్లే దక్కినా అనంతర పరిణామాల్లో నితీశ్‌ను CMగా కొనసాగించింది. అదే మాదిరి MHలో BJP 132 స్థానాల్లో గెలిచినా శిండేకే CMగా అవకాశమివ్వాలని శివసేన కోరుతోంది.