News February 21, 2025
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

బంగ్లాతో విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా పాంటింగ్ రికార్డును ఆయన సమం చేశారు. అన్ని ఫార్మాట్లూ కలిపి 137మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చూశారు. 3 గేమ్స్ డ్రా అయ్యాయి. ఒకటి రద్దయింది. ఇక 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించిన ప్లేయర్ రోహిత్ మాత్రమే.
Similar News
News January 5, 2026
వాల్‌నట్స్ వీరు తినకూడదు

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మెదడు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు, రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, మూత్రపిండాల్లో రాళ్లున్నవారు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్లు ఇవి తీసుకోకూడదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
News January 5, 2026
USలో తెలుగు యువతి హత్య.. ఇండియాలో నిందితుడి అరెస్ట్?

USలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి నిఖిత గొడిశాల(27) హత్యకు గురైన కేసులో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్ అయినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం.. ఇంటర్‌పోల్ సాయంతో అతణ్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు తెలివిగా ఇండియాకు పారిపోయివచ్చాడు.
News January 5, 2026
సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.


