News March 21, 2024

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అతను హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం అతని పిటిషన్‌ను కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది.

Similar News

News October 6, 2024

మోదీ అలా చేస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తా: కేజ్రీవాల్

image

ప్రధాని మోదీకి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కాగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీగా ఇస్తోంది.

News October 6, 2024

YCP ప్రభుత్వంలో పర్యాటక శాఖ నిర్వీర్యం: మంత్రి కందుల

image

AP: వైసీపీ హయాంలో చాలా టూరిజం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. విశాఖలో యాత్రి నివాస్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరంలో MV MAA Shipను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

News October 6, 2024

3 రోజుల్లో రూ.27వేల కోట్లు వెనక్కి

image

ఫారిన్ ఇన్వెస్టర్లు చివరి 3 సెషన్లలోనే రూ.27,142 కోట్లను వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ ఏషియాలో వార్, క్రూడాయిల్ ధరలు, చైనా మార్కెట్లు పుంజుకోవడమే ఇందుకు కారణాలు. స్టిమ్యులస్ ప్యాకేజీ, మానిటరీ పాలసీతో చైనా మార్కెట్లు గత నెల్లో 26% ఎగిశాయి. అక్కడి షేర్ల విలువ తక్కువగా ఉండటంతో FPIలు డబ్బును అక్కడికి మళ్లిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. CY24 SEP నాటికి వీరి పెట్టుబడులు రూ.57,724 కోట్లకు చేరాయి.