News February 21, 2025
నేడు SAvsAFG: అఫ్గాన్ సంచలనమా? సేఫ్ సఫారీనా?

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ దక్షిణాఫ్రికా-అఫ్గాన్ మ్యాచ్ జరగనుంది. మ.2.30కు ప్రారంభం కానుంది. కొంతకాలంగా వన్డేల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న సఫారీలు పుంజుకోవాలని ఆరాటపడుతున్నారు. బవుమా, క్లాసెన్, మార్‌క్రమ్, మిల్లర్, రబడా, షంసీ రాణిస్తే ఆ జట్టుకు తిరుగులేదు. 2023 WCనుంచి అదరగొడుతున్న AFG మరో సంచలనానికి ఉవ్విళ్లూరుతోంది. గుర్బాజ్, జద్రాన్, హష్మతుల్లా, నబీ, రషీద్ ఫామ్‌లో ఉండటం ఆ టీమ్‌కు కలిసొచ్చే అంశం.
Similar News
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: ఉదయం 8 గంటలకు కౌంటింగ్..

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉ.8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు ఫలితాలను EC వైబ్‌సెట్‌లో అప్డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో రౌండ్‌కు 45 నిమిషాలు పట్టనుంది.
News November 14, 2025
బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్‌లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
News November 14, 2025
నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

⋆ 1889: భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జననం (ఫొటోలో)
⋆ 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం
⋆ 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
⋆ జాతీయ బాలల దినోత్సవం
⋆ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
⋆ ప్రపంచ మధుమేహ దినోత్సవం


