News February 21, 2025
అనంతపురం వైసీపీ నేతకు అంతర్జాతీయ అవార్డు

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిట్లూరి రమేశ్ గౌడ్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దుబాయ్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నుంచి అవార్డును అందుకున్నారు. సామాజిక, రాజకీయ, వ్యక్తిగత కేటగిరిలో అవార్డు దక్కినట్లు ఆయన తెలిపారు. చిట్లూరి రమేశ్ ఇటీవలే వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయనకు పలువురు వైసీపీ నేతలు అభినందనలు చెప్పారు.
Similar News
News February 22, 2025
గ్రూప్-2 పరీక్షలపై అనంతపురం కలెక్టర్ క్లారిటీ!

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగవలసిన గ్రూప్-2 పరీక్షలు రద్దు అయ్యాయని సోషల్ మీడియాలో వస్తున్న వాటికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయలేదని తెలిపారు. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే పరీక్షలను వాయిదా వేయాలని APPSCకి ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.
News February 22, 2025
శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.
News February 22, 2025
అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.