News February 21, 2025

కర్నూలులో జీబీఎస్ కేసు.. వ్యాధి లక్షణాలు ఇవే!

image

☞ కాళ్లు, చేతులలో మంట, <<15529133>>తిమ్మిర్లుగా<<>> అనిపించడం
☞ నరాల బలహీనత, కండరాల నొప్పులు
☞ సరిగ్గా నడవలేకపోవడం, తూలడం వంటి లక్షణాలు
☞ నోరు వంకర పోయి మింగలేక ఇబ్బంది పడే పరిస్థతి
☞ చెమటలు ఎక్కువగా పట్టడం
☞ వ్యాధి తీవ్రత ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

Similar News

News July 5, 2025

చెరువులలో ఆక్రమణలు తొలగించండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, గుడిసెలు వంటి తాత్కాలిక ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఇన్‌ఛార్జి కలెక్టర్ డా.బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటి వనరుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 4, 2025

అల్లూరి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేద్దాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News May 7, 2025

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కర్నూలు కలెక్టర్

image

విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే మంచి స్థాయిలో నిలుస్తారని అన్నారు.