News February 21, 2025
5 సార్లు MLA.. HYDలో అవమానం!

ఆయన 5 సార్లు MLAగా పనిచేశారు. అయినా.. హైదరాబాద్‌లో నిరీక్షణ తప్పలేదు. CM రేవంత్ రెడ్డి కార్యాలయ సిబ్బంది తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించారని మాజీ MLA గుమ్మడి నర్సయ్య వాపోయారు. గంటల పాటు బయట వేచి చూశానని, అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదన్నారు. తన లాంటి సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. CM రేవంత్ రెడ్డి తన లాంటి నాయకులను కలవరా? అంటూ గుమ్మడి నర్సయ్య నిలదీశారు.
Similar News
News January 9, 2026
సంక్రాంతికి ఫ్రీ టోల్ లేనట్లే!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.
News January 9, 2026
త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.
News January 9, 2026
శ్రీకాకుళం జిల్లాలో రూ.135.37 కోట్లతో విద్యుత్ ఆధునీకరణ పనులు

శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ ఆధునీకరణ పనులకు రూ 135.37 కోట్లు మంజూరయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. రూ. 80 కోట్లతో శ్రీకాకుళంలో 132/23 కేవీ విద్యుత్ ఉపకేంద్రం చిలకపాలెం-అంపోలు మధ్యలో నిర్మిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు.


