News February 21, 2025
24 గంటలూ షాపులు తెరవచ్చు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

TG: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలో మార్చి 2 నుంచి 31 వరకు షాపులను 24 గంటలూ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే యాజమాన్యం రెట్టింపు వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. సెలవుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.
News September 19, 2025
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ అసోసియేట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* NIT- వరంగల్ 2 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 23వరకు అప్లై చేసుకోవచ్చు.
News September 19, 2025
‘కల్కి-2’ నుంచి దీపిక ఔట్.. కారణాలివేనా?

‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను <<17748690>>తీసేయడంపై<<>> నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె డిమాండ్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన టీమ్ మొత్తాన్ని (25 మంది) లగ్జరీ హోటల్‌లో ఉంచాలనడంతో పాటు 25% రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు 5-7గంటలే పనిచేస్తానని డిమాండ్ చేశారట. ఆమె రెమ్యునరేషన్ హైక్‌కు ఓకే చెప్పినా, షూటింగ్ టైమ్ తగ్గించడానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీవర్గాలు పేర్కొన్నాయి.