News February 21, 2025
కాగజ్‌నగర్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ పున:ప్రారంభం

ఆసిఫాబాద్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 వరకు తాత్కాలికంగా రద్దు చేసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తిరిగి ఇవాళ నుంచి పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్నం 3.35గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరనుంది. ప్రయాణికులు గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.
Similar News
News September 18, 2025
పల్నాడులో బార్లకు రాని దరఖాస్తులు

పల్నాడు జిల్లాలో బార్ లైసెన్స్‌ల కోసం వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు లైసెన్స్‌ల కోసం ఎంత మొత్తం అయినా చెల్లించడానికి సిద్ధపడిన వ్యాపారులు, కొత్త మద్యం పాలసీ కారణంగా ఆసక్తి చూపడం లేదు. ఎక్సైజ్ అధికారులు రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసినా సరైన స్పందన రాలేదు. జిల్లాలో మిగిలిన 30 బార్లలో కేవలం 8 బార్లకు మాత్రమే 32 దరఖాస్తులు వచ్చాయి.
News September 18, 2025
వరంగల్: ఈత కల్లు సీజన్ షురూ..!

ఓరుగల్లు జిల్లాలో తాటికల్లుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తాటికల్లు సీజన్ పూర్తై, ఈతకల్లు సీజన్ మొదలవుతోంది. గౌడన్నలు ఈదులను గీయడంతో కల్లు పారడం మొదలైంది. దసరా నాటికి పూర్తి స్థాయిలో కల్లు అందుబాటులోకి వస్తుంది. ఉమ్మడి జిల్లాలోని గోపనపల్లి, కల్లెడ, గట్టికల్, పాలకుర్తి, పాకాల, మడిపల్లి, కంఠాత్మకూర్, శాయంపేట, ఆత్మకూర్, బ్రాహ్మణపల్లి, వల్మిడి, తాల్లపూపల్లి వంటివి కల్లుకు ఫేమస్ ప్లేసులు.
News September 18, 2025
ADB: ఇక పల్లె రహదారులపై రయ్ రయ్..!

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని జిల్లా కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం భారీగా నిధులు మంజూరయ్యాయి. మొదటి దశలో భాగంగా పలు రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 30 రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.659.97 కోట్లకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రానికి అనుసంధానం కాని గ్రామాలు, మండలాలను కలుపుతూ కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేపట్టనున్నారు.