News March 21, 2024

చంద్రబాబు వృద్ధుడు.. ఓటెయ్యొద్దు: విజయసాయి

image

టీడీపీ అధినేత చంద్రబాబు వృద్ధుడైపోతున్నారని, ఆయనకు ఓటు వేయొద్దని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో పిలుపునిచ్చారు. ‘చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు. కొడుకును పైకి తీసుకురావడం, రిటైర్మెంట్‌కు డబ్బు సంపాదించడం ఆయన ఎజెండా. ఆంధ్రుల కలల్ని ఆయన ఎలా నెరవేరుస్తాడు? ఏపీకి స్థిరమైన యువ నేత కావాలి’ అని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీకి మధ్య ఎప్పుడూ సమన్వయం ఉండదని.. ఒక కుటుంబమే బాగుపడుతుందని విమర్శించారు.

Similar News

News September 8, 2025

‘సృష్టి’ కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘<<17423890>>సృష్టి<<>>’ ఫర్టిలిటీ కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సస్పెండ్ అయ్యారు. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆంధ్ర వైద్య కళాశాల అనస్థీషియా HOD డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఉషాదేవి, శ్రీకాకుళం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిపై HYDలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.

News September 8, 2025

భారత్ పొరుగు దేశాల్లో గొడవలు.. ప్రభుత్వాల మార్పు

image

2021 మయన్మార్: ఎన్నికైన ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు. ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు
2022 శ్రీలంక: అప్పులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఆందోళనలు. ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స రాజీనామా
2024 బంగ్లాదేశ్: షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. హసీనా రాజీనామాతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
>తాజాగా నేపాల్‌లో యువత ఆందోళన.. హోంమంత్రి రాజీనామా

News September 8, 2025

ఒకే ఫ్రేమ్‌లో పవర్, ఐకాన్, గ్లోబల్ స్టార్స్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో దర్శనమిచ్చారు. అల్లు అరవింద్ అమ్మ కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. చిరంజీవి దంపతులూ హాజరయ్యారు. ఈ ఫొటోలను గీతా ఆర్ట్స్ షేర్ చేసింది. కనకరత్నం ఆశీస్సులు తమపై ఉంటాయని పేర్కొంది. కాగా తమ అభిమాన హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.