News February 21, 2025
తాళ్లపూడి : ప్రేమించలేదని యువతిపై దాడి

సీనియర్ ఇంటర్ చదువుతున్న యువతిపై ప్రేమించడంలేదని దిలీప్ కుమార్ (19) దాడి చేసిన ఘటన తాళ్లపూడిలో జరిగింది. చదువు ఆపేసి జులాయిగా తిరిగే దిలీప్ కొంత కాలంగా యువతిని వేధించేవాడు. బుధవారం ఆమె కళాశాల వద్దకు వెళ్లి ప్రేమించకుంటే తన జీవితం నాశనం చేస్తానని బెదిరించి , దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.యువకుడిని గురువారం కోర్టుకు తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News October 18, 2025
నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నిడదవోలు మండలం మునిపల్లి – కలవచర్ల మార్గంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మునిపల్లికి చెందిన అత్తిలి నాగరాజు (45) మృతి చెందాడు. కోరుపల్లి అడ్డరోడ్డు వద్ద నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు.
News October 18, 2025
నిడదవోలు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

నిడదవోలు మండలం డి. ముప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు, కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ, ఆర్డీఓ సుస్మితా రాణి పాల్గొన్నారు.
News October 16, 2025
క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు: కలెక్టర్

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. గురువారం ఆసుపత్రిలో ఆమె వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.