News February 21, 2025
చిత్తూరు: రేపు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల22వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత అధికారులు, సభ్యులు తప్పకుండా హాజరవ్వాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News September 19, 2025
చిత్తూరు: టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కలేనా..?

చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్‌గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చ లేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
News September 18, 2025
కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
జిల్లాలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: కలెక్టర్

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గ పరిధిలోని 125 క్లస్టర్లలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలు, సొసైటీలలో యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.