News March 21, 2024
ప్రచారాల్లో పాల్గొనే వాలంటీర్ల తొలగింపుకు చర్యలు: కలెక్టర్

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనే వాలంటీర్లను తొలగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులతో పాటు గౌరవ వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని చెప్పారు.
Similar News
News April 9, 2025
గుంటూరు మీదుగా హుబ్లీ-కతిహార్ మార్గంలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా హుబ్లీ-కతిహార్ మార్గంలో కొత్తగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. హుబ్లీ-కతిహార్(07325) ప్రత్యేక రైలు ఏప్రిల్ 9 నుంచి 30వ తేదీ వరకు ప్రతీ బుధవారం హుబ్లీ నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా కతిహార్ చేరనుంది. ఇదే మార్గంలో కతిహార్-హుబ్లీ(07326) రైలు ఏప్రిల్ 12 నుంచి మే 3వ తేదీ వరకు ప్రతి శనివారం కతిహార్ నుంచి బయలుదేరుతుంది.
News April 9, 2025
గుంటూరు: డెలివరీ బాయ్స్ వివరాలు నమోదు చేయండి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 18-59 సంవత్సరాల వయస్సు గల డెలివరీ బాయ్స్ సహా అసంఘటిత రంగం కార్మికులు తమ వివరాలు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రారంభమైన ఈ ప్రత్యేక డ్రైవ్ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, కార్మికులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు.
News April 9, 2025
రీసర్వే డేటాను వేగంగా నమోదు చేయండి: భార్గవ్ తేజ

గుంటూరు జిల్లాలో భూముల రీసర్వే పూర్తైన 14 గ్రామాల వివరాలను ఆన్‌లైన్‌లో సరైన విధంగా నమోదు చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రీ సర్వేలో సేకరించిన డేటా తప్పులు లేకుండా నమోదు కావాలని, ఇది భవిష్యత్తులో భూ వివాదాలను నివారించే దిశగా కీలకంగా పనిచేస్తుందన్నారు. గ్రౌండ్ ట్రూ థింగ్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.