News February 21, 2025
మిర్చిధరలపై కేంద్రమంత్రి సమావేశం

AP: మిర్చి పంటకు కనీస మద్దతు ధరపై వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ నేతృత్వంలో నేడు భేటీ జరగనుంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం ద్వారా పంట మద్దతు ధరపై సంబంధిత వర్గాలతో చర్చించనున్నట్లు సమాచారం. ధరల పతనంపై సమీక్షతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యను కేంద్రమంత్రికి వివరించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 37 సమాధానాలు

1. నీళ్లు తాగుతున్న శబ్దం విని, జింక అనుకొని దశరథుడు శ్రవణుడ్ని సంహరించాడు.
2. అభిమన్యుడు, ఉత్తరల పుత్రుడు పరీక్షిత్తు.
3. వాయు దేవుడి వాహనం ‘జింక’.
4. విష్ణువు మత్స్య అవతారంలో జలరాక్షసుడైన శంఖాసురుడిని సంహరించాడు.
5. నవతి అంటే తొంబై.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 16, 2025
మీనాక్షితో సురేఖ భేటీ

TG: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను మీనాక్షికి వివరించారు. తన ఇంటికి పోలీసులు రావడం, అక్కడ జరిగిన వివాదంపై చర్చించారు. తన కూతురు వ్యాఖ్యలపైనా సురేఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొండా సురేఖ <<18009181>>వివాదంపై<<>> ఏఐసీసీ నివేదిక అడిగిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
News October 16, 2025
స్మృతి, అభిషేక్‌కు ICC POTM అవార్డ్స్

సెప్టెంబర్‌కు గాను ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ ఇండియన్ ఓపెనర్స్‌ను వరించాయి. మెన్స్ విభాగంలో అభిషేక్ శర్మ, ఉమెన్స్ విభాగంలో స్మృతి మంధాన ఎంపికయ్యారు. గత నెల ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో కుల్దీప్, బెన్నెట్(ZIM)ను వెనక్కినెట్టి అభిషేక్ అవార్డు సాధించారు. అటు స్మృతి SEPలో 77 Avgతో 308 రన్స్ చేసి పాక్ ప్లేయర్ సిద్రా, SA స్టార్ టాజ్మిన్ బ్రిట్స్‌ను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నారు.