News February 21, 2025
ములుగు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్‌సైట్!

ఇందిరమ్మ లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. ములుగు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
Similar News
News January 11, 2026
నేటి ముఖ్యాంశాలు

✥ AP: నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN
✥ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్
✥ అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల
✥ TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్‌ని: రేవంత్
✥ సినీ ఇండస్ట్రీ గురించి నేను పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి
✥ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన
✥ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
✥ సంక్రాంతి సెలవులు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ
News January 11, 2026
నిరసనల్లో పాల్గొంటే మరణ శిక్ష: ఇరాన్

నిరసనల్లో పాల్గొంటే దేవుడి శత్రువుగా భావిస్తామని ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. దేశ చట్టాల ప్రకారం మరణశిక్ష అభియోగాలు తప్పవని అటార్నీ జనరల్ ఆజాద్ హెచ్చరించారు. అల్లర్లు చేసే వారికి సాయం చేసినా ఇదే శిక్ష తప్పదని చెప్పారు. ఇప్పటిదాకా 2,300 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నిరసనలను <<18818974>>తీవ్రం చేయాలని<<>> ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ పిలుపునివ్వడం తెలిసిందే.
News January 11, 2026
పల్లెనిద్ర తప్పనిసరి: కడప ఎస్పీ

పోలీస్ అధికారులంతా తప్పనిసరిగా పల్లెనిద్ర చేపట్టాలని జిల్లా ఎస్పీ నచికేత్ సూచించారు. శనివారం కడప పోలీస్ సబ్ డివిజన్ నేర సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి నిలపాలన్నారు. ఫిర్యాదు దారులపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని సమస్యని పరిష్కరించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు.


