News February 21, 2025
MHBD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్‌సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. మహబూబాబాద్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
Similar News
News January 20, 2026
ఏలూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్.. నంబరు ఇదే..!

ఏలూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఉంటే నం.08812-230197కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయా పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్‌నెట్ సెంటర్లను ఉదయం 8:30 గంటల నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
News January 20, 2026
NRPT: ‘కల్లు కింగ్’ లింగయ్య గౌడ్ కన్నుమూత

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ‘కల్లు కింగ్’గా పేరుగాంచిన గౌని లింగయ్య గౌడ్ మహరాజ్(102) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. 1975 నుంచి 2010 వరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కల్లు సొసైటీలపై ఆయన ప్రత్యేక పట్టు సాధించారు. పాలమూరు గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన ఆయన అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News January 20, 2026
జగిత్యాల జిల్లాలో సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

జగిత్యాల జిల్లా పరిధిలో సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. డీఐజీ జోన్–II బసరా ఆదేశాల మేరకు ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పీఎస్ ఎస్సై ఏ.అనిల్‌ను మల్లాపూర్ పీఎస్‌కు బదిలీ చేయగా, కథలాపూర్ పీఎస్ ఎస్సై సి.నవీన్ కుమార్‌ను ఇబ్రహీంపట్నం పీఎస్‌కు నియమించారు. మల్లాపూర్ పీఎస్ ఎస్సై కోసానా రాజును జగిత్యాల సీసీఎస్ పోస్టుకు బదిలీ చేశారు.


