News March 21, 2024
స్టార్ క్రికెటర్లకు షాక్

పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో అదరగొడుతోన్న బాబర్ ఆజం, డేవిడ్ వార్నర్, జేసన్ రాయ్, టిమ్ డేవిడ్, మహ్మద్ రిజ్వాన్‌కు షాక్ తగిలింది. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లీగ్-2024 వేలంలో వీళ్లని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు. విండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్, హెట్‌మెయిర్ ఫస్ట్ రౌండ్‌లోనే అమ్ముడుపోయారు. మహిళల విభాగంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్, జెమీమా, దీప్తి శర్మను ఎవరూ తీసుకోలేదు.
Similar News
News July 9, 2025
మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News July 9, 2025
నిమిషకు మరణశిక్ష.. తప్పెవరిది?

యెమెన్‌లో <<17008510>>నిమిష <<>>మరణశిక్ష ఎదుర్కోబోతుండటం చర్చనీయాంశంగా మారింది. పాస్‌పోర్ట్ లాక్కుని వేధిస్తున్నాడని మెహదీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని అతడికి ఆమె మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఆత్మరక్షణ కోసమే ఇలా చేసిందని, వదిలేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల తప్పు కూడా ఉందంటున్నారు. PM మోదీ జోక్యం చేసుకుని విడిపించాలని కోరుతున్నారు.
News July 9, 2025
సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష.. గడువు పెంపు

TG: సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వరకు పొడిగించినట్లు CMD బలరామ్ నాయక్ తెలిపారు. UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారు దీన్ని గమనించాలన్నారు. తొలుత ఈ నెల 7వరకు గడువు విధించగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ పథకం కింద TG అభ్యర్థులతో పాటు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రూ.లక్ష సాయం చేయనున్నారు.