News February 21, 2025
పి-4 సర్వేపై అధికారులతో సత్యసాయి కలెక్టర్ సమీక్ష

పి-4 సర్వేపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్ షిప్ ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి ఈ సర్వేను నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News January 7, 2026
SVU స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

తిరుపతి SVU స్నాతకోత్సవానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2018 నుంచి 2024 వరకు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 63 నుంచి 68వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు www.svuexams.com ద్వారా దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో సమర్పించాలి. స్నాతకోత్సవం విద్యార్థుల ఎదురుచూపులని ఇటీవల Way2Newsలో వార్త వచ్చిన విషయం తెలిసిందే.
News January 7, 2026
మొక్కజొన్న పొత్తులకు ప్లాస్టిక్ బాటిళ్లు ఎందుకు?

ఆర్గానిక్ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేసే కొందరు రైతులు పొత్తులు వచ్చాక వాటిపై ఉన్న పీచును కత్తిరించి పై ఫొటోలో చూపినట్లుగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉంచుతారు. దీని వల్ల పురుగులు, బాక్టీరియా మొక్కజొన్న లోపలికి వెళ్లలేవు. అలాగే వర్షపు నీరు కూడా పొత్తులోకి వెళ్లకుండా కవచంలా పనిచేస్తుంది. ఫలితంగా ఈ పొత్తులు తాజాగా, ఎక్కడా కుళ్లకుండా, గింజ గట్టిబడి ఆకర్షనీయంగా ఉండి మంచి ధర వస్తుందనేది రైతుల అభిప్రాయం.
News January 7, 2026
కుజ దోష నివారణతో త్వరగా పెళ్లి..

జాతకంలో లగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు దానిని ‘కుజ దోషం’ అంటారు. దీనివల్ల వివాహ సంబంధాలు కుదరడం కష్టమవుతుంది. ఈ దోష ప్రభావం తగ్గేందుకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ‘ఓం శరవణ భవ’ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలుంటాయి. కుజ గ్రహానికి అధిపతి అయిన కందులను దానం చేయడం, మంగళ చండికా స్తోత్రం పఠించడం ద్వారా దోష తీవ్రత తగ్గి, త్వరగా వివాహ ఘడియలు దగ్గరపడతాయి.


