News February 21, 2025

చెరుకుపల్లి: హోంగార్డుపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు

image

చెరుకుపల్లిలో హోంగార్డు శ్రీనివాసరావుపై దాడి చేసిన కేసులో నిందితుడు వాగు దినేష్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి మద్యం మత్తులో రోడ్డుపై గొడవ చేస్తున్న దినేష్‌ను హోంగార్డు శ్రీనివాసరావు అడ్డుకున్నారు. దీంతో అతను హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శుక్రవారం దినేష్‌ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News September 14, 2025

MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News September 14, 2025

గద్వాల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నియామకంపై చర్చలు

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ గద్వాల ఇన్‌ఛార్జ్‌ని ప్రకటించకపోవడంతో క్యాడర్ కొంతమేర నిరాశకు గురైంది. నిన్న జరిగిన సభలో ఇన్‌ఛార్జ్‌ని ప్రకటిస్తారని శ్రేణులు భావించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అన్నీ తానై పార్టీని చూసుకుంటున్న బాసు హనుమంతు నాయుడిని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తారని భావించినా నిరాశ ఎదురయింది.

News September 14, 2025

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

image

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.