News February 21, 2025
కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.
Similar News
News November 7, 2025
ASF: ‘సిబ్బంది శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

ASF డివిజన్‌లోని సిబ్బందికి అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ASF డివిజన్ లోని ఐసిడిఎస్, వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ రీ-ఓరియంటేషన్ శిక్షణ తరగతులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాంలతో కలిసి హాజరయ్యారు.
News November 7, 2025
యాదగిరిగుట్ట ఈవోగా వెంకట్రావుకు బాధ్యతలు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా వెంకట్రావు ఈరోజు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 43 రోజుల వ్యక్తిగత సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఆలయం, క్యూలైన్లు, మాడవీధులు, శివాలయం, పుష్కరిణి, ప్రసాద విక్రయాల విభాగాలు సహా అన్ని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
News November 7, 2025
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.


