News February 21, 2025

కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.

Similar News

News February 24, 2026

పాలకొల్లు: మళ్లీ ‘ఫ్యాన్’ కిందకే మేకా.. సస్పెన్షన్ ఎత్తివేత?

image

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌‌ని ఆయన తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 9న జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా జగన్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో శేషుబాబుపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను అధిష్ఠానం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.

News February 24, 2026

నారాయణ కాలేజీలో ఇంటర్ యువతి మృతి

image

తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని పవిత్ర(17) మృతిచెందింది. అన్నమయ్య జిల్లా గ్యారంపల్లికి చెందిన ఆమెకు జ్వరం రావడంతో కళాశాల యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత శరీరంపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. రుయా ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది. మార్చురీ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు.

News February 24, 2026

ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా?

image

ప్రస్తుతకాలంలో యూట్యూబ్, ఇన్‌స్టాల్లో వైరల్ అయ్యే వాటిని ఫాలో అవడమే ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అవి కొనడం, వాడటం చేస్తున్నారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. సోషల్ మీడియాలో చూపించేవన్నీ నిజం కావని చెబుతున్నారు. మంచి, చెడు మధ్య తేడా గ్రహించేలా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చూసిన ఉత్పత్తులను చూసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.