News February 21, 2025
దోబూచులాడుతున్న బంగారం ధరలు!

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ కాస్త పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,250లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60 పెరగడంతో రూ.88,100లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గి కేజీ రూ.1,07,900 వద్ద కొనసాగుతోంది.
Similar News
News February 22, 2025
సెంచరీతో చెలరేగిన డకెట్.. AUS టార్గెట్ ఎంతంటే?

CT-2025లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. 17 ఫోర్లు, 3 సిక్సులతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో CTలో తొలిసారి 150, అత్యధిక వ్యక్తిగత స్కోర్(165) చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించారు. మరో బ్యాటర్ జో రూట్ 68 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ 3, జంపా, లబుషేన్ తలో 2 వికెట్లు తీశారు.
News February 22, 2025
మళ్లీ థియేటర్లలోకి ‘యుగానికి ఒక్కడు’

తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా సెల్వరాఘవన్ తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలవనుంది. 2010 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, USAలో రీరిలీజ్ అవుతుందని తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
News February 22, 2025
ఆడిన తొలి ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ వీరులు వీరే

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ సెంచరీతో చెలరేగారు. తానాడిన తొలి ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఆయన శతకం బాదడం విశేషం. ఆయనే కాకుండా మరికొందరు ప్లేయర్లు కూడా తామాడిన తొలి ఛాంపియన్స్ టోర్నీలో సెంచరీ చేశారు. వారిలో అలిస్టర్ క్యాంప్‌బెల్, సచిన్, సయీద్ అన్వర్, గుణవర్ధనే, కైఫ్, తరంగ, ధవన్, తమీమ్ ఇక్బాల్, విల్ యంగ్, లాథమ్, హృదోయ్, గిల్, రికెల్‌టన్ ఉన్నారు.