News March 21, 2024

ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించలేం: సుప్రీంకోర్టు

image

ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టే విధిస్తే అది గందరగోళానికి దారి తీస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈసీలుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుపై ఎలాంటి అభియోగాలు లేవని పేర్కొంది. ఈసీ నియామక ప్రక్రియపై కేంద్రాన్ని ప్రశ్నించిన కోర్టు.. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది.

Similar News

News July 8, 2024

స్మృతి మంధాన లవర్ ఇతనే..

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్‌ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్‌ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు మంధాన లవ్ సింబల్స్‌తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.

News July 8, 2024

జంగా కృష్ణమూర్తికి హైకోర్టులో ఊరట

image

AP: మండలి ఛైర్మన్ తనపై అనర్హత వేటు వేయడాన్ని జంగా కృష్ణమూర్తి హైకోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరించారని ఆయన తరఫు లాయర్ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

News July 8, 2024

చంద్రబాబును విమర్శిస్తే వదిలిపెట్టం: సోమిరెడ్డి

image

AP: తెలుగు రాష్ట్రాల గత CMలు జగన్, కేసీఆర్.. ప్యాలెస్, ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఇప్పటి CMలు చంద్రబాబు, రేవంత్ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని తెలిపారు. వీరి భేటీపై మాజీ మంత్రి కాకాణి విమర్శలు సరికాదన్నారు. ఇంకోసారి CBNను విమర్శిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ నియంతలా వ్యవహరించారని, ఆయన పాలన కర్ఫ్యూను తలపించిందని దుయ్యబట్టారు.