News February 21, 2025

సజ్జల కుటుంబ సభ్యుల భూములపై సర్వే

image

AP: కడప (D) CK దిన్నె మండలంలో YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ ఎస్టేట్ ఆస్తులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. మండలంలోని చిత్తూరు-కర్నూలు హైవే పక్కన ఉన్న భూములను ఆక్రమించారనే అభియోగాలపై సర్వే జరిపింది. 147ఎకరాల్లో 55ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే తమ భూమి లేదని అటవీ శాఖ వాదిస్తోంది. దీంతో హద్దులు గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించగా తాజాగా సర్వే చేశారు.

Similar News

News November 7, 2025

VKB: మూసీ జన్మస్థలం.. ఔషధ జలధార!

image

అనంతగిరి అడవి ఔషధ గుణాల నిలయంగా విరాజిల్లుతుంది. అనంతగిరి అడవిలో పెరిగే వేలాది మొక్కల వేర్ల నుంచి వడపోతకు గురయ్యే స్వచ్ఛమైన జలమే మూసీ నదికి ఆధారం. నిజాం కాలంలో టీబీ రోగుల చికిత్సకు ఈ కొండల్లో ఆసుపత్రిని నిర్మించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఇదే. పువ్వుల పుప్పొడి, పచ్చని చెట్ల ఫైటో న్యూట్రియంట్స్‌తో కూడిన స్వచ్ఛమైన గాలి, ఔషధ జలధార ఆరోగ్యానికి సంజీవనిగా పనిచేస్తాయని నాటి వైద్యులు నమ్మేవారు.

News November 7, 2025

రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ&రేటింగ్

image

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల అంతులేని బాధను అనుభవించే పాత్రలో రష్మిక అదరగొట్టారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కథను చెప్పిన విధానం బాగుంది. సాంగ్స్, BGM ప్రధాన బలం. ఎమోషన్లకు పెద్దపీట వేయడంతో స్టోరీ స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అనవసర సీన్లు, కథ ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5

News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59

image

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>