News February 21, 2025
మసీదుల వద్ద సదుపాయాలు కల్పించాలని HNK కలెక్టర్‌కు వినతి

రానున్న రంజాన్ పండగ సందర్భంగా హనుమకొండ ప్రాంతంలో ఉన్న మసీద్ కేంద్రాల వద్ద ప్రభుత్వం నుంచి సదుపాయాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అజీజ్ మిర్జా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజీజ్ మిర్జా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీద్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు.
Similar News
News January 9, 2026
తూ.గో: సీఎం చేతుల మీదుగా పాసు పుస్తకాలు అందుకునేది వీరే!

తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రాయవరం నుంచి రైతు చంద్రమళ్ల కుమారి, వెదురుబాక నుంచి వీరన్న శెట్టి రాముడును అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన రైతులకు సీఎం నేరుగా కొత్త పుస్తకాలను అందజేయనున్నారు. ఈ పంపిణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 9, 2026
‘జన నాయకుడు’కు మరో చిక్కు.. డివిజన్ బెంచ్‌కు సెన్సార్ బోర్డు

విజయ్ దళపతి ‘జన నాయకుడు’ సినిమాకు మరో చిక్కొచ్చి పడింది. U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ <<18806328>>తీర్పును<<>> సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. తీర్పును పునర్‌పరిశీలించాలంటూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
News January 9, 2026
HYD: రూ.40K సాలరీతో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) <<>>కాంట్రాక్టు<<>> పద్ధతిలో HYDలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌లను నియమించనుంది. B.Tech/ B.E పూర్తి చేసి, 3ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. నెలకు ₹40,000 జీతంతో ఏడాది కాంట్రాక్టుతో ప్రారంభమై, 4 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. దరఖాస్తులు జనవరి 6- 20 వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు www.ecil.co.in/job_details_02_2026.php వెబ్‌సైట్‌లో చూడండి.
#SHARE IT


