News March 21, 2024

BIG BREAKING: గ్రూప్-1పై హైకోర్టు కీలక తీర్పు

image

AP: 2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఇటీవల మెయిన్స్‌‌ను హైకోర్టు రద్దు చేసింది. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటూ APPSC డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

Similar News

News July 8, 2024

కొడాలి నానికి హైకోర్టులో ఊరట

image

AP: మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై గతంలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా నానిని అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు 41A నోటీసులు ఇవ్వాలని, విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

News July 8, 2024

బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు

image

సందేశ్‌ఖాలీ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి చురకలంటించింది. ఆ ఘటనపై CBIతో దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ‘ఒక వ్యక్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?’ అని ప్రశ్నించింది.

News July 8, 2024

పేటీఎం షేర్లలో 9% వృద్ధి!

image

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేటీఎంకు ఈరోజు ట్రేడింగ్‌లో సూచీలు ఊరటనిచ్చాయి. గరిష్ఠంగా 9.87% వృద్ధిని నమోదు చేసిన ఆ సంస్థ షేర్లు ప్రస్తుతం 8.11% ప్రాఫిట్‌తో ₹472 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత ఆ సంస్థ షేర్లు ₹310-440 మధ్య కొనసాగుతున్నాయి. తాజాగా ₹36 వృద్ధి చెంది ₹500 మార్క్‌కు చేరువ అవుతుండటంతో ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.