News February 21, 2025
NRPT: సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు ఎంపీ వినతులు

సీఎం రేవంత్ రెడ్డి NRPT జిల్లా పర్యటన సందర్భంగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పలు సమస్యలపై సీఎంకు వినతులు అందించారు. ✓ NRPTకు మంజూరైన మెడికల్ కళాశాలలో పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలి. ✓నియోజకవర్గంలో ఇచ్చిన హామీ మేరకు మూడు మండలాలను వెంటనే ప్రకటించాలి.✓జిల్లా కేంద్రానికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఐటీఐ, పీజీ కళాశాలలను ప్రారంభించాలి. భూనేడు గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News September 18, 2025
VKB: దత్త పీఠాన్ని దర్శించుకున్న స్పీకర్

దత్తాత్రేయుడి కటాక్షంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం దుండిగల్‌లోని దత్త పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, దైవచింతన అలవర్చుకుంటే చక్కటి జీవితం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
News September 18, 2025
ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.
News September 18, 2025
వేగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కోవూరు మండలం వేగూరు పంచాయతీలో పిడుగుపాటుకు గోళ్ల వెంకయ్య మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించారు.