News February 21, 2025
విశాఖ: ఆర్డీఓపై చర్యలు చేపట్టాలి: ఏపీయూడబ్ల్యూజే

విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, కార్యదర్శి కె.చంద్ర రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలంతా కలెక్టర్ విజయకృష్ణణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదిచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, కిషోర్, మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2025
విశాఖలోని 16 సెంటర్లలో గ్రూప్-2 పరీక్ష: జేసీ

విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్స్ సెంటర్లలో రేపు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనునట్లు జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందన్నారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలు ముందుగా అభ్యర్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో 11,029 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.
News February 22, 2025
వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్‌బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.
News February 22, 2025
విశాఖలో 300 మంది పోలీసులకు రివార్డులు

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 300 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందజేశారు. గంజాయి సీజ్ చేసిన పలు కేసులలో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువులను రికవరీ చేసి, సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.