News February 21, 2025

శంభాజీపై అభ్యంతర కంటెంట్: వికిపీడియా ఎడిటర్లపై కేసు?

image

కనీసం నలుగురు వికిపీడియా ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై అభ్యంతరకర కంటెంటును తొలగించాలని కోరినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 10+ Emails పంపితే ఆటోమేటిక్ రిప్లై వచ్చింది గానీ కంటెంట్ డిలీట్ చేయలేదు. దీంతో CM దేవేంద్ర ఫడణవీస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ‘ఛావా’ తర్వాత వికీ కంటెంటుపై ఫిర్యాదులు పెరిగాయి.

Similar News

News April 24, 2025

వక్ఫ్ నిరసనలకు తాత్కాలిక బ్రేక్: ముస్లిం లా బోర్డు

image

పహల్గాం ఉగ్రదాడిపై ఆలిండియా ముస్లిం లా బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘పహల్గాం దాడి చాలా విషాదకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలను 3రోజుల పాటు ఆపుతున్నాం’ అని ప్రకటించింది.

News April 24, 2025

OTTలోకి కొత్త సినిమాలు

image

ఇటీవల థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు OTTలో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ పార్ట్-2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో, మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’ జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్, సైఫ్ అలీఖాన్ ‘జ్యువెల్ థీఫ్’ అందుబాటులోకి రానున్నాయి.

News April 24, 2025

పాక్‌పై భారత్ ఆంక్షలు.. నష్టాల్లో మార్కెట్లు

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ కఠిన ఆంక్షలు విధించడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టపోయి 79,891 వద్ద ట్రేడ్ అవుతోంది. నిప్టీ 50 పాయింట్లు కోల్పోయి 24,278 వద్ద కొనసాగుతోంది.

error: Content is protected !!