News March 21, 2024

వరంగల్ పార్లమెంట్ పరిధిలో 18.16 లక్షల ఓటర్లు

image

వరంగల్ పార్లమెంట్ సీటు పరిధిలో 18.16 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 8,91,969 మంది పురుషులు, 9,24,250 మంది మహిళలు, థర్డ్ జెండర్లు 395 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

Similar News

News January 6, 2025

వరంగల్: బాధితుడిని 6 కి.మీ మోసుకెళ్లిన 108 సిబ్బంది

image

వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవి ప్రాంతంలోని చెలిమెల గుట్టల్లో ప్రెషర్‌బాంబు పేలి బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే. అతనితో ఉన్న కుర్సం ఎడమయ్య, సోడి నర్సింహరావులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారి వద్దకు అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 6 కి.మీ జోల కట్టి బాధితుడిని అంబులెన్స్ సిబ్బంది వినోద్, మరొక వ్యక్తి మోసుకెళ్లారు.

News January 6, 2025

హనుమకొండ: నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

నేడు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు.

News January 5, 2025

ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్ సత్యశారద దేవి

image

వరంగల్ జిల్లా మోగిలిచెర్ల లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో మంత్రి చర్చించారు.