News February 21, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,400, డబ్బి బ్యాగడి రూ.25,500 ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చికి రూ.14,500, టమాటా మిర్చికి రూ.26వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు.
Similar News
News April 22, 2025
వరంగల్: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 4967 మంది పరీక్షలు రాయగా 2890 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 58.18 శాతం నమోదైంది. ఇందులో బాలికలు మొత్తం 2989 మందికి గాను 2039(68.22%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1978 మందికి గాను 851 మంది (43.02%) ఉత్తీర్ణులయ్యారు.
News April 22, 2025
వరంగల్: సెకండ్ ఇయర్ లోనూ వారే ముందజ!

వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. మొత్తం 4743మంది పరీక్షలు రాయగా 3292(69.41%) మంది పాసయ్యారు. బాలికలు మొత్తం 2877 మందికి గాను 2263(78%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1866 మంది విద్యార్థులకు గాను 1029మంది(55.14%) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌లో బాలికలు 431 మంది విద్యార్థులకు గాను 347(80.51%) మంది.. బాలురు 227 మందికి 70(30.84%) మంది పాసయ్యారు.
News April 22, 2025
WGL: ఇంటర్ ఫలితాలు.. జిల్లాల వారీగా ర్యాంకులు

* ఫస్ట్ ఇయర్
* హన్మకొండ-69.60 శాతంతో 5వ RANK
* ములుగు-64.36 శాతంతో 8వ RANK
* భూపాలపల్లి-59.18 శాతంతో 15వ RANK
*వరంగల్-57.93 శాతంతో 18వ RANK
*జనగామ-53.78 శాతంతో 26వ RANK
*మహబూబాబాద్-48.43 శాతంతో 33వ RANK
*సెకండియర్‌లో ర్యాంకులు
* ములుగు-81.06 శాతంతో 1వ RANK
* BHPL-73.73 శాతంతో 6వ RANK
* HNK-73.60 శాతంతో 7వ RANK
*WGL-68.67 శాతంతో 18వ RANK
*జనగామ-64.61 శాతంతో 27వ RANK
*MHBD-63.68 శాతంతో 29వ RANK