News March 21, 2024
మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..

మెదడులో రక్తస్రావం కారణంగా జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వలనే తలెత్తిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘మెదడు కణాలకు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన రక్తం సరఫరా నిలిచిపోవడమే బ్రెయిన్ స్ట్రోక్. తీవ్రంగా తలనొప్పి, ముఖం ఓవైపునకు వంగడం, చేతులపై నియంత్రణ లేకపోవడం, తిమ్మిర్లు వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News April 14, 2025
సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లనున్న కేంద్రం?

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు విధించిన గడువు <<16073336>>తీర్పుపై<<>> కేంద్రం రివ్యూకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్ వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. SC తీర్పు రాష్ట్రపతి నిర్ణయాధికారాన్ని తొలగించేలా ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ప్రెసిడెంట్‌తో చర్చిస్తామని AG వెంకటరమణి తెలిపారు. పిటిషన్ దాఖలుపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
News April 14, 2025
తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్న NIA

ఉగ్రవాది తహవూర్ రాణా వాయిస్ నమూనాలను ఎన్ఐఏ సేకరిస్తున్నట్లు సమాచారం. ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర పన్నేందుకు డేవిడ్ హెడ్లేతో రాణా మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ భారత నిఘా వర్గాల వద్ద ఉన్నాయి. వాటిలో ఉన్నది రాణా గొంతే అని ధ్రువీకరించేందుకు వాయిస్ నమూనాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అతడే అని ధ్రువీకరించిన అనంతరం భారత్ నుంచి ఆ దుశ్చర్యకు సహకరించిన మరింతమంది వివరాల్ని రాబట్టే అవకాశం ఉంది.
News April 14, 2025
ఘోరం: నిండు గర్భిణిని హత్య చేసిన భర్త

నిండు చూలాలైన భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. వైజాగ్‌లోని పీఎంపాలెం పీఎస్ పరిధిలో ఉంటున్న జ్ఞానేశ్వర్, అనూషది ప్రేమపెళ్లి. గత కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. నెలలు నిండిన భార్యను జ్ఞానేశ్వర్ ఈరోజు దారుణంగా గొంతునులిమి హత్య చేశాడు. ఆమెకు ఒంట్లో బాలేదని కుటుంబీకులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తరలించేసరికే అనూష మృతిచెందింది. జ్ఞానేశ్వర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.