News February 21, 2025
టెస్లా కారు రూ.21 లక్షలకు వస్తే మన కంపెనీలకు దెబ్బే.. కానీ!

ఇండియాలో టెస్లా కార్లు రాబోతున్నాయని, వాటి ధర రూ.21 లక్షలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ కంపెనీలో రూ.21 లక్షల ప్రైస్ రేంజ్‌లో కారే లేదు. మినిమమ్ ధర రూ.34 లక్షలుగా ఉంది. పన్నులతో రూ.40 లక్షల వరకు వెళ్లొచ్చు. ఒకవేళ రూ.21 లక్షల్లో తీసుకొస్తే దేశీయ కంపెనీలైన టాటా, మహీంద్రా ఈవీ మార్కెట్లకు పెద్ద దెబ్బే పడనుంది. రూ.40 లక్షలు, ఆపై ఉంటే లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుంది. పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.
Similar News
News February 22, 2025
SRHపై ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్?

IPL టీమ్ SRHపై ఏపీ యువత మండిపడుతోంది. పేరుకే తెలుగు టీమ్ అని, ఒక్క మ్యాచ్ కూడా తమ రాష్ట్రంలో నిర్వహించడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. HYDలోనే మ్యాచులన్నీ నిర్వహిస్తే AP క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్షంగా ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ తెలుగోడు కాబట్టి విశాఖలో 2 మ్యాచులు ఆడిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై SRH ఓనర్ కావ్యా మారన్ ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు.
News February 22, 2025
BIG BREAKING: రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.
News February 22, 2025
రేపు భారత్ ఓడిపోతుంది: IIT బాబా

మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా వైరల్ అయిన అభయ్ సింగ్ రేపు పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. ‘నేను ఇప్పుడే చెబుతున్నానుగా ఇండియా అస్సలు గెలవదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని స్పష్టం చేశారు. బాబా కామెంట్లపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.