News February 21, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో YCP నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన కస్టడీ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కస్టడీ, హెల్త్ పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
Similar News
News February 22, 2025
రేపు భారత్ ఓడిపోతుంది: IIT బాబా

మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా వైరల్ అయిన అభయ్ సింగ్ రేపు పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. ‘నేను ఇప్పుడే చెబుతున్నానుగా ఇండియా అస్సలు గెలవదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని స్పష్టం చేశారు. బాబా కామెంట్లపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
News February 22, 2025
హీరో రామ్ పోతినేనితో మంత్రి కందుల భేటీ

టాలీవుడ్ హీరో రామ్ పోతినేనిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ షూటింగ్ సెట్‌లో కలిశారు. రాజమండ్రిలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కాగా ‘RAPO22’ మూవీ కోసం రామ్ రాజమండ్రిలో ఉన్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ ఆయనను కలిశారు.
News February 22, 2025
రూ.10వేల కోట్లిచ్చినా NEP అమలు చేయం: స్టాలిన్

కేంద్రం రూ.10వేల కోట్లు ఇచ్చినా ‘జాతీయ విద్యా విధానాన్ని’ అమలు చేసేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. NEPని అమలు చేస్తే రాష్ట్రం 2వేల ఏళ్ల నాటి చారిత్రక యుగం నాటికి వెళుతుందని ఆరోపించారు. కామర్స్, ఆర్ట్స్ వంటి కోర్సులకు నీట్ మాదిరి ప్రవేశపరీక్ష ఉండటం ఏంటని ప్రశ్నించారు. హిందీ భాషకు తాము వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా రుద్దటాన్నిఅంగీకరించేది లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.