News February 21, 2025
ఎన్టీఆర్ జిల్లా టుడే టాప్ న్యూస్

1.మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇద్దరికి కఠిన కారాగార శిక్ష. 2. అమలాపురం లాడ్జిలో విజయవాడ వైద్యుడు మృతి. 3. పీఎం సూర్యఘర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి: కలెక్టర్ లక్ష్మిశ. 4. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలసిన ఎంపీ చిన్ని. 5. మైలవరంలో కరెంట్ షాక్ కొట్టి బాలుడి మృతి. 6. వైసీపీ నేత వంశీ పిటిషన్లపై వచ్చే వారానికి వాయిదా పడ్డ విచారణ. 7. విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు.
Similar News
News December 29, 2025
ఇండియా ‘విశ్వ గురువు’ కావాలి: RSS చీఫ్

ప్రపంచ సంక్షేమం కోసం హిందువులు భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని అన్నారు. ‘ప్రపంచం మన వైపు చూస్తోంది. భారత్ విశ్వ గురువు కావడం మన ఆశయం కాదు.. ప్రపంచానికి అవసరం. ఇందుకు చాలా కష్టపడి పని చేయాలి’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
News December 29, 2025
శ్రీ సత్యసాయి: ఎన్నికలు ఏకగ్రీవం

శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా శాఖా ఎన్నికలు కలెక్టరేట్‌లో ఆదివారం జరిగినట్లు ఎన్నికల అధికారి దివాకర్ రావు వెల్లడించారు. హిందూపురం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయ డీటీ గిరిధర్ అసోసియేట్ అధ్యక్షుడిగా, పుట్టపర్తి డీటీ కళ్యాణ చక్రవర్తి కార్యదర్శిగా, సోమందేపల్లి డీటీ శ్రీకాంత్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 29, 2025
‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్‌ప్రైజ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆదివారం ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కానీ విడుదల కాలేదు.


