News February 21, 2025
అఫ్గాన్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

CT-2025: అఫ్గానిస్థాన్‌పై సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 315 రన్స్ చేసింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. రహ్మత్ షా(90) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. SA బౌలర్లలో రబాడ 3, ఎంగిడి, మల్డర్ తలో 2 వికెట్లు తీశారు.
Similar News
News February 23, 2025
భారత జాలర్లను విడుదల చేసిన పాకిస్థాన్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ ప్రభుత్వం 22 మంది భారత జాలర్లను విడుదల చేయడం గమనార్హం. 2021-22లో తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ వారిని అరెస్ట్ చేసింది. 22 మందిలో 18 మంది గుజరాత్, ముగ్గురు డయ్యూ, ఒకరు యూపీకి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల విడుదలైన నాగచైతన్య ‘థండేల్’ స్టోరీ కూడా ఇలాంటి వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కించిందే.
News February 23, 2025
ICC ఈవెంట్స్ అంటే ఆసీస్‌కు పూనకాలే..

కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, మార్ష్ లేరు. స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఉన్న కొద్దిమంది సీనియర్లతో ఆసీస్ టీమ్ CTలో పాల్గొనేందుకు వచ్చింది. ENGతో తొలి మ్యాచ్‌లో కొండంత లక్ష్యం(352). స్మిత్, హెడ్ చెరో 5, 6 పరుగులు చేసి వెనుదిరిగారు. అయినా AUS గెలిచింది. ICC ఈవెంట్స్ అంటే ఆ జట్టు ఆటగాళ్లు ఊగిపోతారు. ఈసారి కొత్త ప్లేయర్ ఇంగ్లిస్ 86 బంతుల్లో 120 రన్స్ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
News February 23, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: చికెన్ అంటే భయమా? వీటిని ట్రై చేయండి!

బర్డ్ ఫ్లూ భయంతో కొందరు చికెన్‌కు దూరంగా ఉంటున్నారు. చికెన్‌కు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల గింజలు తింటే ఎక్కువ బలాన్ని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం తింటే కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శనగలు తింటే పోషకాలు అందుతాయి. వాల్ నట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రాజ్‌మా, జనపనార గింజలు తింటే ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.