News February 22, 2025
ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT
Similar News
News February 22, 2025
ఇదే రికార్డు.. భార్యకు రూ.380 కోట్లు భరణం!

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఓ సెలబ్రిటీ భరణం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. చాహల్ రూ.60 కోట్లు భరణంగా ఇవ్వనున్నారని వార్తలు రాగా ధనశ్రీ ఫ్యామిలీ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 2014లో తన భార్య సుస్సేన్‌కు రూ.380 కోట్ల భరణం ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇండియన్ సెలబ్రిటీల్లో ఇప్పటివరకూ ఇదే అత్యధికమని చెబుతున్నాయి.
News February 22, 2025
SRHపై ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్?

IPL టీమ్ SRHపై ఏపీ యువత మండిపడుతోంది. పేరుకే తెలుగు టీమ్ అని, ఒక్క మ్యాచ్ కూడా తమ రాష్ట్రంలో నిర్వహించడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. HYDలోనే మ్యాచులన్నీ నిర్వహిస్తే AP క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్షంగా ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ తెలుగోడు కాబట్టి విశాఖలో 2 మ్యాచులు ఆడిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై SRH ఓనర్ కావ్యా మారన్ ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు.
News February 22, 2025
BIG BREAKING: రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.