News February 22, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు భక్తులు 462 మంది తలనీలాలు సమర్పించగా రూ.23,100, ప్రసాదాలు రూ.6,15,500, VIP దర్శనం రూ1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.1,17,600, ప్రధానబుకింగ్ రూ.84,300, కార్ పార్కింగ్ రూ.1,62,000, వ్రతాలు రూ.63,200, లీజెస్ రూ.1,54,526 తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.14,84,440 ఆదాయం వచ్చినట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు.

Similar News

News July 6, 2025

భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

News July 6, 2025

NGKL: జిల్లా విద్యుత్ ఎస్ఈ సీహెచ్ పౌల్ రాజ్ బదిలీ

image

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చిన సీహెచ్ పౌల్ రాజ్‌ను బదిలీ చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన ఇక్కడ దాదాపు ఏడాది పాటు ఎస్ఈగా విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాల్సి ఉంది.

News July 6, 2025

కరీమాబాద్‌లో కనుల పండువగా బీరన్న బోనాలు

image

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కురుమల కుల దైవం బీరన్న బోనాల కనుల పండువగా జరిగాయి. కరీమాబాద్, ఉర్సులోని కురుమ కుల మహిళలు భక్తితో బొనమెత్తారు. బీరప్ప సంప్రదాయంగా గావు పట్టగా బోనాలు బీరన్న గుడికి చేరుకున్నాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తిరుగుముఖం పట్టారు. మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.