News February 22, 2025

నేడు భైంసాకు BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాక

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు భైంసాకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రానున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలియజేశారు. సాయంత్రం 4గంటలకు SSజిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గ కార్యకర్తలు, పట్టభద్రుల ఓటర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్‌తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు.

Similar News

News December 3, 2025

బుద్ధారం సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం!

image

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామం బుద్ధారం సర్పంచ్‌గా విడిదినేని శ్రీలత అశోక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన కొమ్మురాజు అమృతమ్మ, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం సాధ్యమైంది. గ్రామంలోని 12 వార్డులకు గాను, 9 వార్డులకు కూడా ఏకగ్రీవం పూర్తయింది.

News December 3, 2025

నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

image

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.

News December 3, 2025

తేమ శాతం 17-25 వరకు ఉన్నా ధాన్యం కొంటాం: జేసీ

image

రేపల్లె మండలం బేతపూడి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ భావన సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా అక్కడున్న గ్రామ వ్యవసాయ సహాయకుని కొనుగోలు కేంద్రంలో నమోదైన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న పరికరాల పనితీరుపై ఆరాతీశారు. రైతులతో వారి ఇబ్బందులు గురించి మాట్లాడారు. తేమ శాతం 17-25 వరకు ఉన్నా రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని వివరించారు.