News February 22, 2025
ముస్లింలను త్వరగా పంపించే ఆలోచన లేదు: కర్ణాటక మంత్రి

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు పని నుంచి త్వరగా ఇంటికెళ్లేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోనూ ఆ సదుపాయాన్ని కల్పించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు. అయితే, తమకు అలాంటి ఆలోచనేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. అలాంటి ప్రతిపాదననేమీ చూడట్లేదని, ఇతర రాష్ట్రాలేం చేస్తున్నాయన్నది తమకు అనవసరమని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 23, 2025
అపోలో ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు మెడికల్ టెస్టులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకున్నారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన టెస్టులు చేయించుకుంటారని పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ హాజరవుతారని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం పవన్ వైరల్ ఫీవర్, వెన్నునొప్పితో బాధపడ్డారు.
News February 23, 2025
రేపు భారత్vsపాకిస్థాన్.. ఎక్కడ చూడాలంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ: రేపు భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం కావడంతో కోట్లాది మంది ఈ మ్యాచ్ చూడనున్నారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు. జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ చూడొచ్చు. దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో రేపు మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. Way2newsలో లైవ్ స్కోర్ పొందవచ్చు.
ALL THE BEST TEAM INDIA
News February 22, 2025
గ్రూప్-2 ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్లు.. APPSC సంచలన ఆరోపణ

గ్రూప్-2 నిర్వహణపై ప్రభుత్వం రాసిన లేఖకు <<15547592>>APPSC<<>> సమాధానం ఇచ్చింది. ‘మెయిన్స్‌కు క్వాలిఫై కాని కొందరు వాయిదా కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరోసారి పరీక్ష రాసే ఛాన్స్ పొందాలి అనుకుంటున్నారు. అభ్యర్థుల ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్లూ ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల విషయాన్ని నోటిఫికేషన్లో చెప్పలేదు. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది’ అని పేర్కొంది.