News February 22, 2025
ADB: ముస్లిం ఉద్యోగులకు GOO NEWS

రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31 వరకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయ విధులు నిర్వహించుకొని ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నమాజ్, రోజా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
Similar News
News February 23, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: ADB కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24వ తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.
News February 22, 2025
ADB: బాలికపై అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్: SP

తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని ADB ఇన్ఛార్జ్ SP జానకి షర్మిల అన్నారు. బాలికపై << 15538444>>అత్యాచార <<>>ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులు అనిల్, గంగాధర్, సుష్మలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 22, 2025
ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ADB జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.