News February 22, 2025
కడెం: దివ్యాంగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర పరిధిలో దివ్యాంగులకు కంప్యూటర్ కోర్సుల్లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నామని తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సట్టి సాయన్న తెలిపారు. దూరప్రాంతాల వారికి ఉచితంగా హాస్టల్ వసతి కూడా కల్పిస్తారన్నారు. ఈ శిక్షణకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8885512035 సంప్రదించాలని కోరారు.
Similar News
News September 17, 2025
ADB: తెలంగాణకు అండ.. కొండా లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. ASF(D)లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించడమే కాక.. టీఆర్ఎస్ ఆవిర్భావంలోనూ కీలకంగా వ్యవహరించారు. 96 ఏళ్లప్పుడూ స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు.
News September 17, 2025
ADB: ‘చేయి’ కలుపుతారా.. కలిసి పనిచేస్తారా?

ADB జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంజీవరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ ప్రధానకార్యదర్శి గండ్రత్ సుజాత పార్టీలో చేరడంతో ఓ వర్గం అసంతృప్తిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పనిచేస్తారా..? కలిస్తే లోకల్ పోరులో వీరి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
News September 17, 2025
ASF: ఆపేరేషన్ పోలోలో తొలిసారి ఈ గ్రామంలోనే జెండా ఆవిష్కరణ

దహేగాం మండలం బీబ్ర గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. ఆపరేషన్ పోలోలో తొలిసారి ఈ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. 1947 AUG 15 అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన సమాచారం ఈ గ్రామ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. దీంతో స్వాతంత్ర్య సమరయోధుడు బండ్ల మల్లయ్య ఇంటి ఆవరణలో జెండా గద్దె నిర్మించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాటి నుంచి నేటి వరకు అక్కడే జెండా ఎగరేస్తున్నారు.