News February 22, 2025

పెద్దపల్లి: కాంగ్రెస్ రూ.50వేల కోట్ల దోపిడీ: బండి సంజయ్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆరోపించారు.

Similar News

News February 27, 2026

కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్

image

TG: మద్యం కుంభకోణం కేసులో కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘లిక్కర్ స్కామ్ సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం BRS. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే తేలిపోతుంది. కుట్రపూరిత కేసులను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News February 27, 2026

హన్మకొండలో ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రెండో రోజు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా జనరల్, వొకేషనల్ విభాగాల్లో కలిపి మొత్తం 18,803 మంది విద్యార్థులకు గాను, 18,397 మంది హాజరయ్యారు. దీంతో జిల్లాలో 98 శాతం హాజరు నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 406 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.

News February 27, 2026

ఏప్రిల్‌లో ఓటర్ల తుది జాబితా: కలెక్టర్ వెట్రిసెల్వి

image

జిల్లా ఓటర్ల తుది జాబితాను ఏప్రిల్‌లో ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం ఆమె అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలక్టర్ మ్యాపింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో సగటున 60.72 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న 1,207 ఫారం- 6, 7, 8 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో అత్యధికంగా 69.11 శాతం మ్యాపింగ్ నమోదైంది.