News February 22, 2025
SKLM: గ్రూప్-2 సర్వీసెస్ పరీక్షలకి సమయపాలన తప్పనిసరి

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అభ్యర్థులంతా సమయపాలన పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. శ్రీకాకుళం మండలం – 8, ఎచ్చెర్ల మండలం – 7గా కేటాయించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.
Similar News
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News November 8, 2025
శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.


