News February 22, 2025

కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

image

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

Similar News

News February 23, 2025

బంజారాహిల్స్: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు ఎద్దేవా

image

కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనం అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదే అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

News February 23, 2025

HYD: కొడుకు చేతిలో తండ్రి హత్య.. (వివరాలు)

image

కుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్న తండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లి గ్రామానికి చెందిన అరెల్లి మెగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బుల కోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్య చేశాడు.

News February 23, 2025

BREAKING: మైనర్లపై పెట్రో దాడి.. గాయాలు

image

పేట్ బషీరాబాద్ PS పరిధిలో దారుణం జరిగింది. జై రామ్ నగర్‌లోని నిర్మాణుష్య ప్రాంతంలో ఆడుకునేందుకు ఐదుగురు మైనర్లు (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు) వెళ్లారు. ఇద్దరు అమ్మాయిలపై జరిగిన పెట్రోల్ దాడిలో ఒక బాలిక(10)కు తీవ్ర గాయలు, మరో బాలిక(9)కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైనర్‌లకు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టే ఎక్కడి నుంచి వచ్చాయన్నది మిస్టరీగా మిగిలింది.

error: Content is protected !!